ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం
అందచేస్తున్న ఆరోగ్య కార్డులను ట్రెజరీ శాఖ ద్వారానే ఇవ్వాలని ట్రెజరీ శాఖ
ఉద్యోగులు డిమాండ్ చేశారు. డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీగా పని చేసిన నాగార్జునరెడ్డి
బదిలీని రద్దు చేయాలని, సొంత శాఖకు తిరిగి పంపాలని ,ఇంటర్నల్ ఆడిట్ విధానాన్ని ట్రెజరీ శాఖకే అప్పగించాలని ,
ట్రెజరీ శాఖలో ఉన్న తాత్కాలిక ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించాలని ,
ఉద్యోగులకు ఇచ్చే ఆరోగ్య కార్డులను ట్రెజరీ శాఖ ద్వారానే ఇవ్వాలని , కరువుభత్యం (డిఎ)ను వెంటనే మంజూరు చేయాలని కోరారు. తమ డిమాండ్లు
పరిష్కరించకపోతే ఈ నెల 25 నుంచి పెన్‌డౌన్‌కు దిగుతామని హెచ్చరించారు. ఈ మేరకు
గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మిన్నీమాథ్యూ, ఆర్థిక మంత్రి ఆనం
రామనారాయణరెడ్డి, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శులు భాస్కర్, సాంబశివరావు, డైరెక్టర్
ఆఫ్ ట్రెజరీస్ కనకవల్లికి వారు సమ్మె నోటీసు అందజేశారు. .